21, మే 2019, మంగళవారం

                                ఒంటరి         4                               

            మూడు సంవత్సరాల ముందు

    ప్రతి రోజూ ఎవరికో ఒకరికి ప్రత్యేకం అయింది.అలాగే ఈ రోజూ వివేక్కి  ప్రత్యేకం అయింది.పోద్దున నుండి అదే అనందంలో ఉన్నాడు.అన్ని పనులు టైం కి పూర్తి చేసి కారులో స్థిదంగా ఉన్నాడు.వివేక్ జీవితం ప్రతిరోజూ ఈ ఎదురుచూపుతోనే మొదలవుతుంది.వివేక్ ఎదురుచూసేది తన సవతి తమ్మూడు అయిన విజేయ్ కోసం.వివేక్ విజేయ్ ఇద్దరు మొదటి రోజూ యం.బి.ఎ కాలేజీకి వేళ్ళతున్నారు.వివేక్ పోద్దున నుండి ఈ విషయం వల్లా ఆనందంగా ఉన్నాడు.ఈ రోజూ కోత్త పరిచయలు అవుతాయి అని ఆలోచనలో ఉన్నాడు.

"ఏరా బయలుదేరాడానికి రెడినా" అన్నా విజేయ్ మాటలకి వివేక్ ఆలోచనల నుండి బయటకి వచ్చాడు.
"నేనూ ఎప్పుడో రెడి" అని కారును ముందుకు కదిలించాడు.

"ఏరా ఏంటి బాగా హ్యాపీగా ఉన్నావ్"

"ఏ నీకు లేదా!" అన్నాడు వివేక్ ఎగిరేసి

"ఉంది. ముందు నీకు ఎందుకు ఉందో చెప్పు"


"ఎంబీఏలో కి వెళ్తున్నాం. కొత్త కాలేజీ  "

"ఎంబీఏ ,కొత్త కాలేజీ  తర్వాత ముందు కో-ఎడ్ అది చెప్పాలి.రెండు సంవత్సరాలు మనతోపాటు అమ్మాయిలు కూడా చదువుకుంటారు"

"నీకు ఎప్పుడూ అమ్మాయిల గో లే"


"సృష్టిలో అందమైనది అమ్మాయి రా" అన్నాడు విజయ్

కారు కాలేజీ గేటు దాటి లోపలకి వేళ్ళి అగింది.
వివేక్ ,విజేయ్ లు కారు దిగి రెండు అడుగులు వేయగనే 


కాలేజీ బిల్డింగ్ దగ్గర నలుగురు కూర్చున్నారు.

వివేక్ విజయ్లు రావటం చూసి "ఎరామీరు జూనియర్ల "అన్నాడు అందులో ఒకడు
అవును అని ఇద్దరూ తలలూపేరు.

"వాళ్ళతో ఏం మాట్లాడతావ్ కానీ నీ వెనకాల చూడు అందమైన అమ్మాయి వస్తుంది " అన్నాడు ఇంకొకడు


అందరూ ఒక్కసారి వెనక్కి తిరిగి చూశారు.

వివేక్ మొదటిసారి గీతని చూసింది అప్పుడే

నలుగురిలో ఒకడు వివేక్ తో  "వెళ్లి ఆఅమ్మాయి సైజు కనుక్కో రా "అన్నాడు
"ఏంటి  ర్యాగింగ్ "అన్నాడు విజయ్

"అవును వెళ్లి కనుక్కో"
"సార్ "అన్నాడు వివేక్ భయంతో.

"తప్పదు బాబు వెళ్ళు"

చేసేదేమీ లేక వివేక్ ఆ అమ్మాయి వైపు నడిచాడు

"మేడం" అన్నాడు

ఆ మాటకి గీత వెనక్కి తిరిగింది


"మీ సైజు చెప్తారా" అన్నాడు.
మాట పూర్తవకముందే వివేక్ ని చెంపమీద లాగి పెట్టి కొట్టింది
అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వటం మొదలు పెట్టారు.

అక్కడ ఏం జరుగుతుందో తెలియక గీత గబగబా ముందుకు నడిచింది.

ఈలోపు కాలేజ్ బిల్ కొట్టడంతో అందరూ అక్కడి నుండి కదిలారు.

"ఏరా బాగుందా మొదటిరోజు" అని విజయ్ అన్నాడు

వివేక్ మౌనంగా నిలబడి గీత వెళ్ళిన వైపే చూస్తూ ఉన్నాడు.

"బావా "అన్న పిలుపుకు ఎవరా అని చూడగ ఎదురుగా రామ్ కనిపించాడు. విజేయ్ , రామ్  ఇద్దరు ఇంటర్ నుండి స్నేహితులు.విజేయ్ నే భరించడం తప్పదు అనుకుంటె రామ్ గాడిని కూడ భరించాలా అని వివేక్ మనసులో అనుకున్నాడు.విజేయ్ ,రామ్ కలిసి గోల చేయడం మొదలుపేడితే ఏలా ఉంటుందో వివేక్ కి బాగా తేలుసు.

"ఏరా నువ్వు ఇక్కడైనా"
"అవును బావ"
"ఎంబీఏ క్లాస్ తెలుసా"

"పద క్లాస్ కి వెళ్దాదాం "విజయ్ రామ్ తో అన్నాడు.

వివేక్ వాళ్ళిద్దర్నీ అనుసరించాడు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి